August 09, 2008

వానకి ఓ వందనం

రెండు రోజులుగా,
జోరు జోరుగా వాన - హొరు హొరున వాన

ఊరంతా వాగులయ్యేంతగా వాన
వరదలా ఉప్పొంగిన వాన

వానా వానా, ముంచెత్తే వానా
చినుకు పడితే చాలు చిత్తడైపోయే మా ఊరిలోన
చెలరేగిపోయాతావెందుకే వానా

నెలల తరబడి ముఖం చాటేస్తావే వానా
ఆకలి మంటలు రగిలిస్తావే వానా
జాలి లేదా నీకు వానా

వస్తేనేమో,
వాగు వంకలు నింపి, నదుల గట్లు తెంపి
ఊళ్ళే మింగేస్తావు వానా - అంత ఆకలా నీకు వానా

నువ్వు లేకుంటే, తినగ మెతుకుండదే వానా
నువ్వు వస్తే, అడుగు బయటపెట్టే వీలుండదే వానా
ఇలా, అతి చేస్తావెందుకే మతిలేని దానా
నీ రూపు నాజూకు వానా, కానీ
నీకు హృదయమే లేదు కాబోలు వానా

(ఇలా అన్నానని ఏమీ అనుకోకే వానా ... మరి నిన్నా, ఈరోజు ఏక ధాటిగా కురిసి, నువ్వు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టావుగా, అందుకని కోపమొచ్చి అలా రాసాను.)
ఇట్లు,
నీ నేను
హైదరాబాద్
Aug 9th, 2008

7 comments:

Kranthi M said...

బాలు గారు,
హైదరాబాదు పెట్టాల్సిన కేక మొత్త౦ మీరే పెట్టేసారుగా కేకోకేక.బాగు౦ది.

Srividya said...

బాగా రాసారు. కానీ పాపం పిచ్చి వానని గట్టిగా
తిట్టేసారు.మీకు భయపడే అనుకుంటా ఒక్క చినుకు కూడా నేల పై రాలలేదు.

కొత్త పాళీ said...

cool.
నగరంలో వాన అని కుందుర్తి ఆంజనేయులు గారిది అనుకుంటా ఒక దీర్ఘ కవిత ఉండాలి. చాలా బావుంటుంది.

Anonymous said...

క్రాంతి గారు, మీకు నచ్చినందుకు థ్యాంక్స్ అండి.

@ శ్రీవిద్య: అదేనండి బాబు ఈ వానతో వచ్చిన సమస్య. భయమేస్తే నాకు చెప్పవచ్చుగా, మాట్లాడకుండా అలా వెళ్ళిపోవాలా?


కొత్తపాళీ గారు, కవిత నచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఆంజనేయులు గారి కవిత link వీలైతే ఇవ్వండి. నేనూ చదువుతాను.

Purnima said...

బాగుంది!! వాన వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ!! అలగద్దన్నా ఒకవేళ వాన అలిగితే ఏం అంటుందో ఇక్కడ చూడండి:

http://oohalanni-oosulai.blogspot.com/2008/03/blog-post_23.html

Subhaprada said...

chala bagundi Balu :)
maa oori manasu baagane telusukunnavu!!! :)

Anonymous said...

Purinama garu, Thanks for your comment. వాన స్వగతం బాగుంది. హడావిడి జీవితాలలో ఆస్వాదన లేకుండాపోతోంది.

@ Subha: Thank You. ఇది మన ఊరు కదా. 'మా ' అన్నావేమిటి?