July 27, 2008

ఏమి మాయ చేసావో ...

నా గుండె సవ్వడి
నాలోని అలజడి
మునుపెన్నడు లేదిది
నాకంతా వింతగా ఉన్నది

ఎప్పుడు తూరుపు తెలవారిందో
ఎప్పుడు ఆకాశం నల్లరంగు పులుముకుందో

పగలేదో, రేయేదో
తెలియకనే రోజు గడిచిపోతున్నది
ఏమి మాయ చేసావో ...

నిద్దురలో కలలా కమ్ముకుంటావు
పగలైతే అంతా నీవై కనపడతావు
కల ఏదో, నిజమేదో తెలియకుండా చేసావు

నీతలపుల చినుకులలో నన్ను తడిపివేసావు

5 comments:

Kranthi M said...

nice post balu keep going

Anonymous said...

Thank you Kranti kumar

Bolloju Baba said...

రేయేదో పగలేదో తెలియకపోవటం,
కల ఏదో నిజమేదో తెలియకపోవటం
తలపుల చినుకులలో తడిపేయటం

భలే మాయలో పడిపోయి మమ్మలనీ పడేసారు.
బొల్లోజు బాబా

Anonymous said...

బాబా గారు, మాయలో పడినందుకు చాలా థ్యాంక్స్ అండి.

Reena said...

Balu title tho cinema kuda teesaru:)